calender_icon.png 29 June, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుబేదార్ బంగ్లాకు కొత్త సోబగులు

29-06-2025 01:07:09 AM

  1. --   139 ఏళ్ల వారసత్వం.. ఓరుగల్లుకు మణిహారం
  2. బంగ్లాను హెరిటేజ్ కట్టడంగా గుర్తించిన రాష్ట్రప్రభుత్వం
  3. రూ.2 కోట్లతో సుందరీకరణ పనులు

ఓరుగల్లు అంటేనే చారిత్రక కట్టడాలకు ఆలవాలం. కాకతీయుల శిల్పకళా సంపదకు భాండాగారం. ఓరుగల్లు కోట, రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి.. ఒక్కో ప్రదేశానికి ఒక్కో చారిత్రక నేప థ్యం ఉంది. అలాగే హనుమకొండలోని సుబేదారి బంగ్లాకు కూడా 139 ఏళ్ల చరిత్ర ఉంది.  నిజాంపాలన కాలంలో నాటి సుబేదార్ జార్జ్ పామర్ బంగ్లా నిర్మాణానికి పూనుకున్నారు. 1886లో బంగ్లా పనులు ప్రారంభమై, అదే సంవత్సరం నిర్మాణ పను లు పూర్తయ్యాయి. అంతటి చరిత్ర ఉన్న బంగ్లాను రాష్ట్రప్రభుత్వం హెరిటేజ్ కట్టడంగా గుర్తించింది.

కాకతీయ అర్బన్ డెవల ప్‌మెంట్ అథారిటీ (కుడా) రూ.2 కోట్ల నిధులతో నాలుగు నెలల క్రితం బంగ్లాను సుందరీకరించింది. దీంతో ఇప్పుడు బంగ్లా అధునాతన ఫ్లోరింగ్, విద్యుద్దీకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తున్నది. ప్రస్తుతం భవనాల పెయింటింగ్ పనులు జరుగుతున్నా యి. త్వరలో బంగ్లాలో ఒక గ్రంథాల యం, పురాతన వస్తువుల ప్రదర్శనశాల, ఫుడ్ కోర్ట్ కూడా అందుబాటులోకి రానున్నది. తద్వారా పర్యాటకులను ఆకర్షించేం దుకు సర్కార్ ప్రణాళికలు రచిస్తున్నది. వచ్చే నెలలో బంగ్లాను సందర్శన కేంద్రంగా ప్రకటించే అవకాశం ఉంది.

13 ఎకరా విస్తీర్ణంలో..

బంగ్లాలో 22 గదులు, రెండు మూడు సమావేశ మందిరాలు, బావి, నీటి కొలనుతో మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో బంగ్లా రూపుదిద్దుకున్నది. బంగ్లా చుట్టూ ప్రాకారంగా ప్రహరీ నిర్మాణం జరిగింది. బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గోడ గడియారం గంటకు ఒకసారి మోగుతూ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సమయాన్ని తేలియజేసేది. 1948 సెప్టెంబర్ 17 వరకు బంగ్లాలో ఆ సుబేదార్ల (ఏరియా కమాండర్) కుటుంబం ఉండేది.

ఏ కొత్త సుబేదార్ అక్కడ చార్జ్ తీసుకున్న వారి కుటుంబం బంగ్లాలోనే ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం బంగ్లాను స్వాధీనం చేసుకున్నది. 1950 నుంచి వరంగల్ జిల్లాకు నియమితులైన కలెక్టర్ నివాస గృహంగా కొనసా గుతున్నది. అప్పటి నుంచి ఇప్పటివరకు బంగ్లాలో 57 మంది కలెక్టర్లు తమ కుటుంబంతో కలిసి ఉన్నారు. 

 బండి సంపత్‌కుమార్,

మహబూబాబాద్