29-06-2025 01:04:11 AM
మేషం
ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మధ్యమం గా ఉంది. కుటుంబసభ్యులతో సఖ్యతగా ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అనుకూల సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తుల కు ధనలాభం, ప్రమోషన్లు. వ్యాపారస్తులు అధిక లాభాలు. విద్యార్థులు చదువులలో ముందుంటారు. రైతు లు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే పనుల్లో విజయవంతం. శుభవార్తలు వింటారు. ధన వ్యయం. యువతీ యువకులకు ఉద్యోగ, పెండ్లి విషయాలలో పురోగతి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు చాలా లాభాలు వస్తాయి. విద్యార్థులకు విదేశీయానం ఫలిస్తుంది. రైతులకు లాభాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది.-
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ధనవ్యయం అవుతుంది. అందరితో విభేదాలు.తొందర పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో బంధువులతో సందడిగా ఉంటుం ది. యువతీ యువకులకు ఉద్యోగ, వివా హ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభాలు. ఉద్యోగస్తులకు ధనలాభం. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. బంధువులతో కలహం కలుగుతుంది. చేసే పనులు పూర్తవుతా యి. శుభకార్య విషయంలో ధన వ్యయమవుతుంది. మానసిక అశాంతి ఏర్పడు తుంది. కొందరితో భేదాలు కలుగుతాయి.
యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో స్తబ్దత ఉంటుంది. విద్యార్థు లు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు సంతోష వార్తలు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో సామాన్య లాభా లు.మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధనలాభం కలుగుతుంది. చేసే పనులలో అభివృద్ధి ఉంటుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ధనాదాయం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. శుభవార్తలు వింటారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. చేసే పనులు పూర్తవుతాయి-. కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలా భం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగం, కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి.
విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. శుభం జరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వా రంలో గ్రహస్థితి మంచిగా ఉంది. సంతృప్తిగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. మానసిక ఆనందం, బం ధువులతో సాన్నిహిత్యం కలుగుతుంది. చేసే పనులు కలిసివస్తాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో సానుకూలత.
విద్యార్థులు శ్రమిం చవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూలకాలం కాదు. మొ త్తం మీద ఈ రాశివారికి 65శాతం అనుకూలత, 35శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. అశాంతిగా ఉంటారు. ఆలోచించి పనులు చేయాలి. వేగిర పడరాదు. శుభవార్తలు వింటారు. పసులలో ఆటంకాలు కలుగుతాయి. బంధువులతో స్పర్ధలు కలుగుతాయి. ధన వ్యయమవుతుంది.
యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుం ది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అను కూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఖర్చులు పెరుగుతాయి. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అను కూలిస్తాయి. విద్యార్థులు చదువులలో శ్రద్ధ చూపుతారు. వ్యాపారస్తులు, రైతులు చేసే పనులలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పనిభారంతోపాటు ధనలాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వా రంలో గ్రహస్థితి మంచిగా ఉంది. ధనలాభం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి. - విద్యార్థులు పట్టుదలతో చదవాలి.వ్యాపారస్తులకు,రైతులకు సామాన్యలాభాలు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. అన్నింటిలో ఒత్తిడి పెరు గుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. -విద్యార్థులు పట్టుదలతో చదువుతారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యమంగా ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలించవు.
విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపా రస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.