4 July, 2026 | 11:31 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఇస్సన్నపల్లిలో నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశం

06-03-2026 12:00 AM

భిక్కనూర్, మార్చి 5(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  లబ్ధిదారులకు వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గ్రామ సర్పంచ్ మేకల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు,ప్రజాప్రతినిధులు, యువకులు , గ్రామస్తులు  పాల్గొన్నారు. నూతన ఇళ్లలో ప్రవేశించిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు.