calender_icon.png 21 January, 2026 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచ్కుందలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

21-01-2026 03:16:29 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా  బిచ్కుంద పట్టణ కేంద్రంలో జనసేన పార్టీ  కార్యాలయన్ని బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ ప్రారంభించారు.   కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా తీసుకెళ్లేందుకు ఈపార్టీ కార్యాలయం కేంద్రబిందువు అవుతుందని, జనసైనికులకు మరింత అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తామని, ఈ కార్యాలయం నుండే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించలన్నారు. 

రానున్న స్థానిక బిచ్కుంద పట్టణ పురపాలక ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తామని అన్నారు.జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేసారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ ఆధ్వర్యంలో 50 మంది జనసేన పార్టీ లో  చేరారు.  జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.జన సేన నాయకులు మాట్లాడుతూ.. రాబోయే రోజులో పార్టీ ని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ఎల్లవేళలా పరిష్కారం చేసే వీధంగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.