మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్లు
12-06-2024 01:49 AM
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్లు కేటాయించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 22 ల్యాం డ్ క్రూజర్లను కొనుగోలు చేయగా, వాటిని పలువురు మంత్రులకు కేటాయించారు. విజయవాడలో బుల్లెట్ ప్రూఫింగ్ పనులను పూర్తికావడంతో ఆ వాహనాలను మంత్రుల వాహన శ్రేణిలో ప్రోటోకాల్ అధికారులు చేర్చా రు. గతంలో ఇవే వాహనాలపై వివా దం కొనసాగింది. అప్పటి సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ కోసం ఖరీదైన 22 ల్యాండ్ క్రూజర్లను విజయవాడలో దాచారని సీఎం రేవంత్‌రెడ్డినే చెప్పా రు. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.






