2 July, 2026 | 5:58 PM

నేడు టెట్ ఫలితాలు

12-06-2024 01:50 AM

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,86,381 మంది దరఖాస్తు చేసుకోగా 2,36,487 మంది హాజరయ్యారు. ఈ నెల 3న ప్రాథమిక కీని విడుదల చేశారు. ముందస్తు ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ రోజు ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన తెలిపారు.