02-05-2025 12:31:34 AM
గద్వాల, మే 1 ( విజయక్రాంతి ) కేం ద్ర ప్రభుత్వ పథకం కింద జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహ పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగు పరిచేందుకు జి ల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెం ట్ మేనేజర్ పోస్టులను సృష్టించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఒక ప్రక టనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీ య సూక్ష్మ , చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల సంస్థ జిల్లాకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఇట్టి పోస్టులను కాం ట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసు కునేందుకు మే, 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఇతర వివరాలకు www.nimsme.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని, ఇతర వివరాలకు సెల్ నెంబర్ 8688921546 ను సంప్రదించాలని సూచించారు.