calender_icon.png 2 May, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్సే

02-05-2025 12:04:57 PM

తెలంగాణను బీజేపీ సర్కార్ విస్మరించింది

జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్సే

హైదరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వరంలో బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి. న్యాలకల్ మండలం రత్నపూరానికి చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... తెలంగాణను బీజేపీ(Bharatiya Janata Party) ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని హరీశ్ రావు పేర్కొన్నారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్ల్యం ప్రజలకు శాపంగా మారిందని పేర్కొన్నారు.