02-05-2025 12:32:21 AM
రెవెన్యూ సదస్సులో రైతుల సమస్యలను తెలుసుకోనున్న అధికారులు త్వరలో భూభారతి చట్టం అమలు
కామారెడ్డి, మే 1 (విజయ క్రాంతి): గతంలో నీ ప్రభుత్వం ధరణి పథకాన్ని తెచ్చి ఉన్న వారి భూములను లేని వారికి రికార్డుల్లో నమోదు చేయడమే కాకుండా అధికార బలం ఉన్న నాయకుల అండదండలతో అప్పటి వీఆర్వోలు వీఆర్‌ఏలు డబ్బులకు కక్కుర్తి పడి పైళ్ళల్లో ఉన్న పేర్లను గల్లంతు చేశారు.
దీంతో నిజాయితీగా రికార్డులో ఉన్న వారి పేర్లు గల్లంతయ్యాయి. మరికొందరు లీడర్ తమ అనుచరుల పేర్లు మీద భరణిలో ఎక్కించి పాస్ పుస్తకాలు పొందారు. ఆ పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకుల్లో రుణాలు పొందడమే కాకుండా ప్రభుత్వ పథకాలను రుణమాఫీని పొందారు. ప్రభుత్వంకు చెందిన కోట్ల రూపాయల ఆదాయాన్ని గండి కొట్టారు.
భూభారతి చట్టంతో సమస్యలు దూరం
భూభారతి చట్టం ప్రస్తుత ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తే రైతుల భూ సమస్యల కు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తుంది. ఫీల్ మీదికి వెళ్లి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగివేసారిన రైతులకు పాస్ పుస్తకాలు లభించక భూమి ఉన్న కూడా ఇతరుల పేరు మీద పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడంతో ధరణి పథకం ప్రవేశపెట్టడంతో భూ సమస్యలు మరిన్ని పెరిగాయి. జవాబు దారి తనం లేకపోవడంతో భూ సమస్యలు పరిష్కారం కన్నా ఎక్కువ సమస్యలు పెరిగాయి. పేద మధ్యతరగతి రైతులకు గతంలో ఉన్న రికార్ళ్లలో తమ పేర్లు గల్లంతయ్యాయి. ధరణి వల్ల తాము ఏం చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.
రైతులు మాత్రం గత పది సంవత్సరాలుగా సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వానికి భూ సమస్యలపై ఎన్నో ఆర్థిక రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పథకాన్ని రద్దుచేసి భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టింది. భూమి మోకా మీద ఎవరున్నారు ఎంత భూమి ఉంది చుట్టుపక్కల ఎవరెవరు రైతులు ఉన్నారు సరిహద్దులు గుర్తించి రికార్డుల్లో నమోదు చేయనున్నారు.
దీనివల్ల భవిష్యత్తులో భూమి ఉన్న రైతులకు భూ సమస్యలు రావని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం ఉద్దేశం బాగానే ఉన్నా ఏ మేరకు అమల్లోకి వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. గ్రామ గ్రామాన మంత్రి విలేజి రెవెన్యూ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించనుంది. ప్రక్రియను ముమ్మరం చేసింది. అర్హులైన వారు లేకుంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేసి భర్తీ చేసి వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.
గ్రామాల వారిగా అధికారుల నియామకం
గ్రామాల్లోని భూ సమస్యలు ఎక్కువగా ఉండడంతో రైతులకు అందుబాటులో గ్రామ రెవెన్యూ అధికారులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం చేపడుతుంది. త్వరలోనే భూభారతి చట్టం అమల్లోకి రానుంది. తీరనున్నాయి. జిల్లాలో 5 53 గ్రామ పంచాయతీలు ఉండగా 440 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఎంతమంది వీఆర్వోలు ఉండేవారు. కామారెడ్డి జిల్లాలో 257 రెవిన్యూ గ్రామాలు ఉండగా197 రెవిన్యూ అధికారులు ఉన్నారు.
భూ సమస్యల పరిష్కారమే ధ్యేయం
రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని అమల్లోకి చేస్తుంది. ఈనెల 24 వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ఆదేశాల మేరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులుఏర్పాటు చేసి రైతు సమస్యలను రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు.
స్థలాలకు సంబంధించిన హద్దులు ఏర్పాటు చేయనున్నారు. శాశ్వతంగా రైతులకుభూ సమస్యలు లేకుండా ఉండాలని ఉద్దేశంతో ఓ భారతి చట్టాన్ని అమలులోకి ప్రభుత్వం తెచ్చింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
విక్టర్, జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్, కామారెడ్డి