హంపిపై వైశాలీ విజయం
స్టావెంజర్ (నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో బుధవారం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలీ రెండో రౌండ్‌లో తెలుగు తేజం కోనేరు హంపిని ఓడించి 4 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఈ టోర్నీలో క్లాసికల్ విభాగంలో వైశాలీకి ఇది తొలి విజయం. ఇక భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లారెన్‌తో జరిగిన పోరు డ్రా కాగా.. ఫలితం తేల్చేందుకు నిర్వహించిన ఆర్మ్‌గెడాన్‌న్‌లో ప్రజ్ఞానంద పరాజయం చవిచూశాడు. పురుషుల విభాగంలో రెండో రౌండ్‌లోనూ మూడు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగియడంతో ఆర్మ్‌గెడాన్ మ్యాచ్‌ల్లో స్థానిక ఆటగాడు, నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ జపాన్ గ్రాండ్‌మాస్టర్ నకమురాను ఓడించి 3 పాయింట్లు సాధించాడు.






