calender_icon.png 31 December, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

30-12-2025 09:25:10 PM

పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్

విజయక్రాంతి,పాపన్నపేట: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలే తప్ప విషాదాన్ని మిగిలిచేలా చేసుకోవద్దని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేసుల్లో ఇరుక్కున్న యువత భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడ వద్దని ఆయన సూచించారు. మద్యం మత్తులో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని, కుటుంబం వీధిన పడాల్సి వస్తుందని ఆయన సూచించారు. తాగి పోట్లాటలకు దిగొద్దన్నారు. ఎవరైనా మద్యం సేవిస్తే డ్రైవింగ్ కు డ్రైవర్ ను వినియోగించుకోవాలని సూచించారు. డిసెంబర్ 31తో పాటు జనవరి ఒకటిని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.