30-12-2025 09:22:21 PM
పాల్వంచ,(విజయక్రాంతి): నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ పాల్వంచ వారు సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్య పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యర్థం డెస్క్ బల్లలను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ & జడ్పీ సీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం బి.నాగాలక్ష్మి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వివిధ ప్రభుత్య పాఠశాలకు నవ అధించిన సహకారల గురించి ప్రస్థావిస్తూ, కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ప్రయోగ శాలలు, ప్రయోగ పరికరాలు అందించారు.
అలాగే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాటానికి నైపుణ్యం గల ఉపాధ్యయులను నియమించారు. విద్యరులకు ఉచిత ట్యూషన్ ఏర్పాటు చేశారు. 39 ప్రభుత్య పాఠశాలల విద్యార్థులు మరుగుదోడ్లు లేక ఇబ్బంది పడుతుంటే వారికి వాష్రూమ్స, హ్యాండ్వాష్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇలా నవ విద్యార్థుల కోసం ఎన్నో మంచి కార్యక్రమలను చేపట్టడం చాలా గొప్ప విషయం అని అభినధించారు. అనంతరం నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ సిఎస్ఆర్, ఎంజిఎం ప్రసాద్ మాట్లాడుతూ... ఇప్పటివరకు ప్రభుత్య పాఠశాలలో నవ లిమిటెడ్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్య పాటలకు 4,500 ల బల్లలను అందించడం జరిగింది అని చెప్పారు.