calender_icon.png 31 December, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో నిబంధ‌న‌లు పాటించాలి

30-12-2025 09:32:18 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): 2025 సంవ‌త్సరం ముగిసి 2026వ సంవ‌త్స‌రంలో అడుగుపెడుతున్న నేప‌థ్యంలో ఈ నెల 31వ తేదీ అర్ధ‌రాత్రి న్యూ ఇయ‌ర్ జ‌రుపుకోనున్న సంద‌ర్భంగా ప్ర‌భుత్వం నిర్దేశించిన నిబంధ‌న‌ల మేర‌కు వేడుకలు జ‌రుపుకోవాల‌ని మునిప‌ల్లి ఎస్ఐ రాజేష్ నాయ‌క్ అన్నారు. మండ‌లంలోని బుదేరా పోలీస్ స్టేష‌న్ లో స్థానిక విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని, వాటిని తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌న్నారు.

ముఖ్యంగా జాతీయ ర‌హ‌దారులపై, రోడ్లపైన కేకులు కటింగ్ చేయరాదని, హోటల్స్,  రెస్టారంట్స్ ల‌లో సమయపాలన పాటించాల‌ని సూచించారు. అలాగే ఈవెంట్లలో డ్రగ్స్,  ఇతర  నిషేధిత పదార్థాల వినియోగం జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు న‌మోదు చేస్తామ‌న్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ‌ల్ లో భాగంగా  మద్యం సేవించి వాహనాలు  నడిపితే  జరిమానా, లైసెన్స్ రద్దు  చేయ‌డం జ‌రుగుతుంది.

ఈ ప్రాంతమంలో పోలీసులు  ప్రత్యేక తనిఖీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు  తెలిపారు. న్యూ ఇయ‌ర్    వేడుకల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీ టీమ్స్  నిఘా ఉంటుందని,  అత్యవసర సమయంలో ఏదైనా సాయం కోసం వెంటనే డైల్ 100 లేదా 112 కి కాల్  చేయాల‌న్నారు. ఈ విష‌యాన్ని  ప్రజలందరూ  గ‌మ‌నించి కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు  జ‌రుపుకోవాల‌ని కోరారు.