4 July, 2026 | 1:43 PM

జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి

12-06-2024 12:55 AM

విజయోత్సవ ర్యాలీలో ఎంపీ సురేశ్ షెట్కార్

జహీరాబాద్, జూన్ 11: జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. ఎంపీగా గెలుపొందిన సందర్భంగా మంగళవారం జహీరాబాద్‌లో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం షెట్కార్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డుతూ.. తనపై నమ్మకంతో ఎంపీగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపు తున్నానని అన్నారు. ప్రత్యేక రోడ్లు, రైల్వే లైన్లు, పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు గిరిజా షెట్కార్, నాయకులు మంకాల్ సుభా శ్, హన్మంత్‌రావు పాటిల్, హుగ్గేలి రాము లు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, ఖాజమియా, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిచంద్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్లు జగన్నాథ్ రెడ్డి, సిద్ది లింగయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.