calender_icon.png 17 July, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమిష ఉరిశిక్ష అమలు వాయిదా!

16-07-2025 12:00:00 AM

  1. యెమెన్ జాతీయుడి హత్య కేసులో కేరళ నర్సు నిందితురాలు
  2. బాధిత కుటుంబం ‘బ్లడ్ మనీ’కి ఒప్పుకుంటే క్షమాభిక్షకు అవకాశం
  3. నిమిషకు అన్ని విధాల సాయం అందిస్తాం: భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ, జూలై 15: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ (36)కు కాస్త ఊరట లభించినట్టు తెలుస్తోంది. ఆమె ఉరిశిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గతంలో నిర్ణయించిన ప్రకారం జూ లై 16న నిమిషకు మరణ శిక్ష అమలు చేయాల్సి ఉండగా.. చివరి క్షణంలో స్థానిక అధికారులు దీనిని నిలిపివేసినట్లు సమాచారం అందింది.

ఈ కేసు మొదలై నప్పటి నుంచి నిమిషకు అన్ని విధాల సాయం చేసేందు కు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. నిమిష కుటుంబం.. బాధిత కు టుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేలా ప్రయత్నాలు చేశామని పేర్కొంది. యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ ఆఫీసుతో నిరంతరం సంప్రదింపులు జరిపా మని, వాటికి ఫలితంగానే నిమిష మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు అధికారులు అంగీకారం తెలిపార ని విదేశాంగ  వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసులో బాధిత కుటుంబం బ్లడ్ మనీ (క్షమాధనం) తీసుకునేందుకు ఒ ప్పిస్తే నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అ వకాశముంది. బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబా న్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అ బూబాకర్ ముస్లియార్ ఇప్పటికే సంప్రదింపులు జరిపా రు. బాధిత కుటుంబానికి దాదాపు రూ. 8.6 కోట్లు బ్లడ్ మనీని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైంది. 

ఏమిటీ నిమిష ప్రియ కేసు?

కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో స్వదేశానికి తిరిగొచ్చిన నిమిష థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత నిమిష యెమెన్‌లో ఒక క్లినిక్ తెరవాలనుకుంది. కానీ యెమెన్ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది.

దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహదీ అనే వ్యక్తిని నిమిష జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత కుమార్తె వేడుక కోసం భారత్‌కు వచ్చిన నిమిష .. భర్త థామస్, కూతురును ఇక్కడే వదిలేసి యెమెన్‌కు వెళ్లిపోయింది. దీనిని అదనుగా భావించిన మెహది .. నిమిష నుంచి డబ్బును లాక్కోవడంతో పాటు వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది.

2016లో మెహది ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు ఈ కేసును పట్టించుకోలేదు. అయితే 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి అతడి వద్ద ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ మత్తు మందు డోస్ ఎక్కువ కావడంతో అదిబ్ మెహది మృతి చెందాడు.

ఆ తర్వాత మృతదేహాన్ని ఒక వాటర్ ట్యాంక్‌లో పారేసి, అక్కడి నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా యమెన్ సరిహద్దులో నిమిషను పోలీసులు అరెస్టు చేశారు. 2020లో యెమెన్ లోకల్ కోర్టు నిమిషకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఉరిశిక్ష తీర్పును సవాల్ చేస్తూ యెమెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిమిషకు అక్కడా చుక్కెదురైంది. ఆమె పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను అమలు చేయాలంటూ తీర్పునిచ్చింది.