16-07-2025 12:00:00 AM
కారులో చక్కర్లు కొట్టిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
టెస్లా ‘మోడల్ Y’ కారు ప్రారంభ ధర 61.07 లక్షలు
ముంబై, జూలై 15: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల షోరూం భారత్‌లో అడుగుపెట్టింది. మంగళవారం ఉదయం ముంబైలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోని మార్కర్ మ్యాక్సి టీ మాల్‌లో దేశంలోనే మొట్టమొదటి టెస్లా షో రూం ప్రారంభమయింది. ఈ షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. తొలుత ‘మోడల్ Y’ ఈవీలను టె స్లా భారత్ మార్కెట్లో విక్రయించనుంది.
ఇక్కడ ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్ (బేస్) ‘మోడల్ వై’ ధర రూ. 61.07 లక్షలుగా నిర్ణయించింది. లాంగ్ వెర్ష న్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. అమెరికాలో ఇ దే కారు రూ. 38.63 లక్షలు కాగా.. చైనాలో 31.57 లక్షలుగా ఉంది. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చుల కారణంగా భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉంది.
షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా సీ ఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ఈ కంపెనీ కార్ల డిజైన్, ఇన్నోవేషన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. 2015లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు తొలిసారి టెస్లా కారులో తిరిగాను’ అని పేర్కొన్నారు.
టెస్లా కారు ప్రత్యేకతలివే..
ప్రపంచవ్యాప్తంగా టెస్లా మోడల్ వై కారు ఆల్‌వీల్ డ్రైవ్‌గా లభిస్తోంది. వీటిల్లో లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జీ చేస్తే గరిష్ఠంగా 500 కిమీ దూరం వరకు ప్రయాణించొచ్చు. కేవలం 4.6 సెకన్లలోనే గంటకు 0 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
అత్యధికంగా గంటకు 200 కిమీ వేగంతో ప్రయాణించగలదు. దీనిలో 15.4 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను అమర్చారు. వెనక సీట్లలోని ప్యాసింజర్ల కోసం 8 అంగుళాల ప్రత్యేకమైన స్క్రీన్ కూడా ఉంటుంది. అడాస్ ఫీచర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు కస్టమర్లకు లభించనున్నాయి.