calender_icon.png 17 July, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోయలో పడిన వాహనం

16-07-2025 12:00:00 AM

  1. 8 మంది మృతి.. పలువురికి గాయాలు

ఉత్తరాఖండ్ పితోర్‌గఢ్‌లో ఘటన

డెహ్రాడూన్, జూలై 15: ఉ త్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. పితోర్‌గఢ్‌లోని మువానీ పట్టణంలో ప్రయాణికులతో వెళ్తున్న యాత్రికుల వాహనం ప్రమాదవశాత్తు లోయలో ప డిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు బృందాలు ఎన్డీఆర్‌ఎఫ్‌తో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేశాయి.

జిల్లాలోని మువానీ నుంచి బోక్తాకు వాహనం ప్రయాణిస్తుండగా భండారీ గ్రామ సమీపం వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 150 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి వాహనం పడిపోయింది. ప్రమాద తీవ్రతతో 8 మంది సంఘటనా స్థలిలోనే మరణించినట్టు జిల్లా ఎస్పీ రేఖా యాదవ్ తెలిపారు.

వాహనంలో మొత్తం డ్రైవర్ సహా 12 మంది ప్రయాణిస్తున్నట్టు పేర్కొన్నారు. పితోర్‌గఢ్ పోలీసులు.. అగ్నిమాపక శాఖ, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో కలిసి సహాయక చర్య లు ప్రారంభించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి విచారం వ్యక్తం చేశారు.