26 August, 2026 | 4:10 AM

ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నిమ్మటూరి

26-08-2026 01:43 AM

జిల్లా సమితిలోకి ఐదుగురికి స్థానం

సత్తుపల్లి ఆగస్టు25( విజయ క్రాంతి): ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ఖమ్మం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సత్తుపల్లి పట్టణానికి చెందిన నిమ్మటూరి రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 23, 24 వ తేదీలలో సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటియుసి జిల్లా 17వ మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నిమ్మటూరి రామకృష్ణ మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ కార్మికులకు సేవలందిస్తున్నందుకుగాను సత్తుపల్లి నియోజకవర్గానికి, జిల్లా కమిటీలో జిల్లా సమితి సభ్యులుగా గడ్డం నరసింహారావు, బుగ్గ సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నుండి సుధాకర్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుండి కంచి శ్రీనివాసరావుకు నూతన కమిటీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.