డిఫాల్ట్ రైస్ మిల్లర్‌పై కేసు
మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్‌పై రికవరీ చర్యలు వేగవంతం
‘మిషన్ కే100’లో భాగంగా పోలీసులకు పౌరసరఫరాల శాఖ ఫిర్యాదు
మహబూబాబాద్, ఆగస్టు 25 (విజయక్రా ంతి): ధాన్యం ఇవ్వకుండా డిఫాల్ట్‌గా మారిన రైస్ మిల్లర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సీఎంఆర్ కోసం ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకుండా డిఫాల్ట్‌గా మారిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామ పరిధిలోని మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమా న్యంపై ‘మిషన్ కే 100’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2023 సంవత్సరానికి సంబంధించి సదరు మిల్లు యాజమాన్యానికి 2,783.080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించగా, 1,586.714 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉండగా, అధికారుల పరిశీలన సమయంలో మిల్లులో ఎటువంటి ధాన్యం లేనట్లు గుర్తించి, ప్రభుత్వ ఒప్పందాన్ని మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్ అతిక్రమించిందని కేసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీఎం వివరించారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో రికవరీ చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు, డిఫాల్ట్‌కు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్, మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా డిఫాల్ట్ రైస్ మిల్లర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.






