17 April, 2026 | 8:45 AM

నిమ్జ్ భూసేకరణ వేగవంతం చేయాలి

11-06-2025 01:20 AM

ప్రత్యేక కార్యదర్శి సంజయ్ 

జహీరాబాద్, జూన్ 10 : జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు అయ్యే జాతీయ ఉత్పత్తి ఉత్పాదక సంస్థ భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఝరాసంగం మండలంలో భూసేకరణ జరిపిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. రైతుల వద్ద ఉన్న భూములను తీసుకునేందుకు రైతులతో మాట్లాడాలని సంజయ్ కుమార్ సూచించారు. 

ఇంకా మిగిలిన భూమిని సేకరించేందుకు రైతులతో మాట్లాడాలని సూచించారు.  ఝరాసంగం మండలంలోని ఎలుగోయి, చీలపల్లి,  బర్దిపూర్ గ్రామాలలో సేకరించిన భూములను పరిశీలించి ఇంకా ఎంత భూమి ఉందో మ్యాప్ ద్వారా పరిశీలించారు.  ఇంకా కావలసిన భూసేకరణకు రైతులతో సమావేశమై వారితో చర్చించి పూర్తి స్థాయిలో భూసేకరణ చేపట్టాలని సూచించారు. వీరితోపాటు ఐఎఫ్‌ఎస్ పి అధికారి డాక్టర్ విజయేందర్ రెడ్డి,  మండలాధికారులు పాల్గొన్నారు.