17 April, 2026 | 7:15 AM

బుద్ధ విహార్‌కు నిధులు కేటాయిస్తాం

11-06-2025 01:20 AM

జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ 

జహీరాబాద్, జూన్ 10: జహీరాబాద్ నియోజకవర్గం బూచనేల్లిలో గల బుద్ధ విహార్ కు ప్రహరీ గోడ నిర్మించేందుకు నిధులు కేటాయిస్తామని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ తెలిపారు.  మంగళవారం ఆయన  మాట్లాడుతూ బుద్ధ విహార్ స్థల విషయంలో ఫిర్యాదులు వచ్చాయని, ఎవరైనా తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

రైతుల భూమి ఆక్రమించి సరిహద్దు రాళ్లు పాతినట్లు వచ్చిన ఆరోపణలో నిజం లేదని,  సర్వే నంబర్ 90 బుద్ధ విహార్ స్థలంలోనే రాళ్లు పాతినట్లు రెవెన్యూ అధికారులు వివరించినట్లు ఆయన తెలిపారు. ఎంపీ సురేష్ శెట్టి కార్ ను కలిసిన వారిలో జహీరాబాద్ బుద్ధిష్ట్ సొసైటీ సభ్యులకు ఎంపీ భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో బూచనేల్లి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి,  బుద్ధిష్ట్ సొసైటీ అధ్యక్షులు దశరథ్, సభ్యులు రాములు, మొగులయ్య, రాజు, మచందర్, నవీన్ కుమార్, సమత సొసైటీ దళ్ రాష్ట్ర నాయకులు బాలరాజ్, తెలుగు ఈ బౌద్ధ విహార్ అధ్యక్షులు రామయ్య, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఖండియం నర్సింలు,  మున్సిపల్ కోఆప్షన్ మాజీ సభ్యులు ఉన్నారు.