కలగందే అయ్యిందా..
యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను రెడీ’. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్‌తో అలరించనుంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్, గోపరాజు రమణ, రూప లక్ష్మి, హరితేజ, మహతి, జయవాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘మెరుపులే మెరుపులే’ సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ ఈవెంట్‌కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘కలగందే అయ్యిందా.. కలలానే ఉందా.. అరె రాత్రికి రాత్రే రాతే మారే టైమే వచ్చిందా..’ అంటూ సాగుతోందీ గీతం. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్ స్వరపర్చగా, రితేశ్ జీ రావ్, లక్ష్మీ మేఘన పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: నిజార్ షఫీ; సంగీతం: మిక్కీ జే మేయర్; కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్; ఎడిటర్: ప్రవీణ్ పూడి; యాక్షన్: రామకృష్ణ.






