17-05-2025 12:00:00 AM
జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్
వనపర్తి టౌన్ మే 16: ఓడినా...గెలిచిన నిత్యం ప్రజల కోసం పరితపించే నిరంజన్ రెడ్డి ఎక్కడ? కుంభకర్ణుడిలాగ ఆరు నెలలకోసారి నిద్రలేచి నిరంజన్ రెడ్డినీ తిట్టే నీవు ఎక్కడ మేఘారెడ్డి? నిరంజన్ రెడ్డి నీ ఉరితీయడం కాదు .నిన్ను ఊరి పొలిమేరలు దాటించే రోజులు దగ్గర పడ్డాయని బి ఆర్ యస్ జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, మాజీ మార్కెట్ ఛైర్మెన్ లక్ష్మారెడ్డి అన్నారు.
శుక్రవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాస గృహంలో జరిగిన మీడియా సమావేశములో వారు మాట్లాడారు ఎమ్మెల్యే గా గెలిచి 18నెలలు అయ్యింది పద్దెనిమిది పైసల పనిలేదని పేపర్ పులిలాగ వచ్చాయి రూ 1000కోట్లు రానున్నాయి అంటూ ఊరించడమే పనిగా పెట్టుకొని ప్రజలను ఏమార్చినట్లు ప్రతిపక్షాలను ఏమార్చాలని చూస్తే తగ్గేదే లేదు గుర్తుపెట్టుకొని మాట్లాడాలని మండిపడ్డారు.
పొద్దుగాల లేస్తే నిరంజన్ రెడ్డి నీ తిట్టాలి ఇదే మీ పని మీకు నిరంజన్ రెడ్డి ఫోబియా పట్టినట్టు ఉంది మిమ్మల్ని నిమ్స్ హాస్పిటల్ కు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచిస్తున్నాం అని అన్నారు.మేఘారెడ్డి మెగా బ్రోకర్ గా మారిన వైనం. ఉమ్మడి జిల్లాలో, హైదరాబాద్ సచివాలయంలో కమీషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు చేసిన ఆందోళన అందరికీ తెలుసునని ఆ వసూళ్లు చేసిన బ్రోకర్ ఎవరో కూడా ప్రజలకు తెలుసన్నారు.
ఆరు గ్యారంటీలు,420హామీలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే వాళ్లకు ముఖం చాటేసి అసహనంతో నిరంజన్ రెడ్డినీ అడిపోసుకోవడం న్యాయమా....మేఘారెడ్డి.పిన్న వయసులో అదృష్టం కొద్ది ఎం.ఎల్.ఏ అయ్యారని నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధిని మించి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని వారు హితువు పలికారు .ఈ సమావేశములో స్టార్.రహీమ్ ,జోహెబ్ హుస్సేన్,సునీల్ వాల్మీకి,చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.