16-05-2025 11:29:53 PM
హనుమకొండ,(విజయక్రాంతి): మారోజు వీరన్న స్పూర్తితో బహుజన రాజ్యాన్ని సాధించడానికి కృషి చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన మారోజు వీరన్న 26వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మారోజు వీరన్న స్పూర్తితో దళిత బహుజనులు ఐక్యతగా రాజకీయ చైతన్యం చెంది బహుజన రాజ్యాధికారాన్ని చేపట్టడానికి ముందుకు సాగాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో స్వాతంత్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా మెజార్టీ ప్రజలు దోపిడీకి గురవుతూనే ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం వాటా సాధించాలంటే బహుజన రాజ్యంలోనే సాధ్య మవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జాక్ చైర్మన్ తాడిశెట్టి క్రాంతి కుమార్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు నున్న అప్పారావు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు చిల్ల రాజేంద్రప్రసాద్, వివిధ సంఘాల నాయకులు కర్ర రాజిరెడ్డి, చాపర్తి కుమార్ గాడ్గే, చీపురు ఓదయ్య, ఐతం నగేష్, న్యాయవాదులు కూనూరు రంజిత్ గౌడ్, అనిల్, రాసమల్ల లక్ష్మణ్, పోతరాజు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.