calender_icon.png 17 May, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపుల చట్టానికి కోరలు పెట్టాలే

17-05-2025 12:00:00 AM

  1. దానిని సంస్కరిస్తేనే రాజకీయాలకు విశ్వసనీయత వస్తది
  2. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్, మే 16 : భారతదేశ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు ఒక సాధారణ దృగ్విషయంగా మారాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి ఉద్దేశించిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఇప్పుడు తన ప్రాథమిక ల క్ష్యాన్ని విస్మరించి, రాజకీయ నాయకుల స్వార్థపూరిత ఎత్తుగడలకు ఒక ఆయుధంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైన సభ్యుడు తన పార్టీని వీడినా, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓ టు వేసినా అనర్హతకు గురయ్యేలా రూపొందించిన ఈ చట్టం కోరలు లేని నాగుపాములా మారిందన్నారు.

ఈ చట్టంలోని లొసుగులు రాజకీయ నాయకులకు తమ వ్యక్తిగత, సంకుచిత రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మార్గాన్ని చూ పుతున్నాయన్నారు. ఒక పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఒకేసారి వేరే పార్టీలో విలీనమైతే వారిపై అనర్హత వేటు పడకపోవడం చట్టంలోని ప్రధాన లోపమన్నారు.

ఈ నిబంధనను అవకాశంగా తీసుకొని, అనేకమంది రాజకీ య నాయకులు తమ పార్టీని చీల్చి, పెద్ద సంఖ్యలో మరో పా ర్టీలో చేరి పదవులను కాపాడుకోవటం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే కాకుండా, రాజకీయ అస్థిరత్వానికి కూడా దారితీస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కు ఉండడం కూడా పార్టీలకు కలిసొస్తోందన్నారు.

స్పీకర్లు అధికార పార్టీకి అను కూలంగా వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపుల పిటిషన్లపై నిర్ణ యం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం కూడా ఫిరాయింపుదారులకు లాభిస్తోందన్నారు. అనర్హత వేటు పడేలోపే వా రు తమ పదవులను అనుభవిస్తున్నారు.

అందుకే ఈ చట్టాన్ని సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టంలోని అస్పష్టమైన నిబంధనలను తొలగించడంతోపాటు ఫిరా యింపుల పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు కాలపరిమితిని విధించాలన్నారు. స్పీకర్ల నిష్పాక్షికతను నిర్ధారించాలని కోరారు.

గౌరవెల్లి’ని ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తరు?

శంకుస్థాపన చేసి ఇరవై ఏండ్లు కావస్తున్నా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం పాలకుల చేతగాని తనానికి నిదర్శనమని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గోదావరి, కృష్ణాజలాలను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.

కేసీఆర్ ఒంటెత్తు పోకడలతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే అది పనికిరాకుండా పోయిందన్నారు. దానిని కమీషన్ల కోసమే కట్టారన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, యెడల వనేశ్, కిష్టపురం లక్ష్మణ్, అందె అశోక్ తదితరులు పాల్గొన్నారు.