calender_icon.png 14 May, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు నిర్మల్ నియోజకవర్గ స్థాయి సమావేశం

14-05-2025 04:21:30 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహిస్తున్నట్టు డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు(DCC President Kuchadi Srihari Rao) తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్(ఖానాపూర్ రోడ్డు)లో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, పీసీసీ పరిశీలకులు శ్రీ చంద్రశేఖర్ గౌడ్, శ్రీ అవేజ్ లు హాజరుకానున్నారని పేర్కొన్నారు.  నియోజకవర్గంలోని మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, లైబ్రరీ చైర్మన్, పార్టీ యువజన, మహిళ, రైతు, విద్యార్థి విభాగం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పీసీసీ సభ్యులు, సేవాదళ్ అధ్యక్షులు, పట్టణ, మండలాల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు మాజీ కౌన్సిలర్ లు సమావేశానికి హాజరు కావాలని కోరారు.