calender_icon.png 14 May, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందిస్తాం

14-05-2025 03:55:40 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ 

భద్రాద్రి కొత్తగూడెం (విజయ క్రాంతి): పాఠశాల పునః ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలను పూర్తిస్థాయిలో పాఠశాలలకు అందించనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా పాఠ్యపుస్తక గోడౌన్(Textbook Godown) పరిశీలించిన ఆయన ఇప్పటికే 70 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయని, మిగిలినవి ఈనెల 25 లోపు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయన్నారు. చేరుకున్న వెంటనే మండలాలకు, అక్కడి నుండి పాఠశాలలకు సరఫరా చేస్తామన్నారు. 

ఈసారి అన్ని రకాల పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను మండల కేంద్రానికి చేరుస్తామని, అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఆయా మండలాల మండల విద్యాశాఖ అధికారి  ద్వారా పాఠ్యపుస్తకాలు అందుకోవాలని ఆదేశించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుస్తకాలు పాఠశాలకు సరఫరా అయ్యే సమయానికి పాఠశాలల్లో అందుబాటులో ఉండి, పాఠ్యపుస్తకాలను పాఠశాల పునః ప్రారంభం రోజున ప్రతి విద్యార్థికి అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి  ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ,  నాగరాజశేఖర్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్ పాల్గొన్నారు.