29 March, 2026 | 3:22 AM

నిర్మల్‌కు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు

29-03-2026 01:34 AM
  1. మూడు స్కోచ్ అవార్డుల ప్రకటన

అవార్డు స్వీకరించిన కలెక్టర్, ఎస్పీ 

నిర్మల్, మార్చి 28 (విజయక్రాంతి): కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు చేస్తు న్న పథకాలకు జాతీయస్థాయిలో నిర్మలకు మరోసారి గుర్తింపు తీసుకొచ్చింది. జిల్లాకు జాతీయస్థాయిలో మూడు స్కోచ్ అవార్డులు దక్కాయి. జిల్లాలో కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక కృషితో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ కొయ్య బొమ్మలకు వినియోగించి పొనికి కర్ర కొరత తీర్చేందుకు పొనికి వనా లు పెంచడానికి ఒక అవార్డు వచ్చింది. అలా గే జిల్లాలో తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా మలిచేస్తున్న అమ్మ రక్షిత పథకానికి మరో అవార్డు దక్కింది.

అలాగే జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యం లో మహిళల భద్రత, విద్యార్థుల భద్రత కు మహిళా పోలీసులతో అమలు చేస్తున్న పోలీ స్ అక్క కార్యక్రమానికి మరో స్కోచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డులను ఢిల్లీలో శనివారం జాతీయ నిర్వాకుల మీదుగా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి అందు కున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ విజయలక్ష్మి, జిల్లా వైద్యా ధికారి డాక్టర్ రాజేందర్ ఉన్నారు. ఈ అవార్డులు తమకు మరింత బాధ్యత పెంచాయని ఇదే స్ఫూర్తితో ముం దుకు వెళ్తామని కలెక్టర్, ఎస్పీ వెల్లడించారు. జాతీయస్థాయి లో స్కోచ్ అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్పీని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.