ఒలింపిక్స్‌కు నిషా దహియా
ఇస్తాన్‌బుల్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత రెజ్లర్ నిషా దహియా అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ సెమీఫైనల్లో 68 కేజీల విభాగంలో నిషా 8 రొమెనియాకు చెందిన అలెంగ్జాండ్రా అంగెల్‌పై విజయం సాధించి పారిస్ బెర్త్ దక్కించుకుంది. ఇక 62 కేజీల విభాగంలో మాన్సి ప్రీక్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. అయితే కాంస్య పతక పోరులో రెపిచేజ్ రౌండ్ ద్వారా ఒలింపిక్ బెర్తు దక్కించుకునే అవకాశముంది. ఇక మహిళల విభాగంలో ఇప్పటివరకు ఐదుగురు రెజ్లర్లు పారిస్ టికెట్ దక్కించుకున్నారు. వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అన్షు మాలిక్ (57 కేజీలు), రితికా హుడా (76 కేజీలు) అంతిమ్ పంగల్ (53 కేజీలు), నిషా దహియా (68 కేజీలు) ఉన్నారు. గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు ప్రిలిమనరీ రౌండ్‌లోనే వెనుదిరిగి ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.






