8 June, 2026 | 2:36 AM

తాగు నీటికి నిజాంసాగర్ నీరు విడుదల

08-06-2026 01:22 AM

నిజాంసాగర్, జూన్ 7(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఏఈ సాకేత్ తెలిపారు. తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నందున  రైతులెవ్వరు ప్రధాన కాలువ ద్వారా పంట సాగు కోసం నీటిని విడుదల చేసుకోవద్దని  ఆయన సూచించారు. గొర్రెల కాపరులు ఇతరులు ప్రధాన కాలువ వెంట నీటిలో దిగరాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.