బీఎల్‌ఏలే పార్టీకి బలమైన పునాది
- జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్
- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ శిక్షణ, సమీక్షా సమావేశం
కామారెడ్డి, జూన్ 7 (విజయక్రాంతి): బి ఎల్ ఏ లే పార్టీకి బలమైన పునాది అని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్ అన్నారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ ఏజెంట్లు శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటర్ జాబితాలో సవరణలు చేయడానికి కానీ ఓటర్ లిస్ట్ లో కొత్త వారిని చేర్చడానికి బిఎ ఉన్న అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదన్నారు. బిఎల్‌ఎ ప్రాధాన్యత బూతులు జంట అనేది పార్టీకి కళ్ళు చెవులు వంటివి అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అత్యంత కీలకమైన అన్నారు. బిఎల్‌ఏల విధులు, బాధ్యతలు, ఎన్నికల సంఘం నిబంధనలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ డీ10 విధానాల వినియోగం వల్ల అంశాలపై స్పోక్ పర్సన్, బి ఎల్ ఏ ల మాస్టర్ ట్రైనర్ మేనేని రోహిత్ రావ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రతి బి ఎల్ ఏ తన బూత్ పరిధిలోని ప్రతి కుటుంబంతో సంబంధాలు కొనసాగించాలని అన్నారు.
కొత్త ఓటర్లను గుర్తించి నమోదు చేయించడం తో పాటు అర్హులైన ప్రతి పౌరుడు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బి ఎల్ ఏ పార్టీకి బలమైన పునాది అని అన్నారు. డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ కుమార్, కౌన్సిలర్లు అంజాద్, లడ్డు, అఖిల, ఫెరోజ్ సుల్తానా, కళ్లెం సావిత్రి, యూనుస్, సీనియర్ నాయ కులు ఇప్ప శ్రీనివాస్,
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొనె శ్రీనివాస్, సుదర్శన్, మండల అధ్యక్షులు కృష్ణ రావు, నరేందర్ రెడ్డి, రాజగౌడ్, నౌసిలాల్, శ్రీనివాస్, రమేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్య క్షులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, ఎస్ టి సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, యువ జన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు కోయల్కర్ కన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






