14 April, 2026 | 9:02 PM

నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ బదిలీ

27-02-2026 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ 

నిజామాబాద్ ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన మార్పుల్లో భాగంగా మొత్తంగా 45మంది అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలిచ్చారు.  అదనపు కలెక్టర్ అంకిత్.. ఈ భారీ బదిలీల్లో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ను బదిలీ చేస్తూ ఆదేశాలు అందాయి. ఆయనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2019 బ్యాచ్‌కు చెందిన ఆయన కొన్నేళ్లుగా అదనపు కలెక్టర్‌గా నిజామాబాద్ జిల్లాలో సేవలందించారు.

అక్కడ కలెక్టర్‌ను జితేష్ వి. పాటిల్‌ను టీజీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, ఎండీగా బదిలీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు ఎవరికీ కేటాయించలేదు.మహబూబాబాద్ కలెక్టర్  అద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం హనుమంత రావు ఎండోమెంట్స్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. 

నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రెటరీగా, జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ జా జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కరీంనగర్ కలెక్టర్ పమీల సత్పత్తి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి  కలెక్టర్‌గా నియామకం అయ్యారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సహకార శాఖ స్పెషల్ కమిషనర్, రిజిస్ట్రార్గా, జనగాం కలెక్టర్ రిజ్వానాబాషా షేక్ గద్వాలకు బదిలీ అయ్యారు.