12 May, 2026 | 11:44 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

నిజామాబాద్ @ 46 డిగ్రీలు

28-04-2026 01:50 AM

12 జిల్లాల్లో 45 డిగ్రీలపైనే 

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం నిజామాబాద్ జిల్లా మెన్‌దోరాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

ఆదిలాబాద్ జిల్లా బేలా లో 45.9 డిగ్రీలు, నిర్మల్ జిల్లా అక్కాపూర్, పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.9, జగిత్యాల జిల్లా ధర్మపురి, కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.8, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, నల్లగొండలో 45.6, సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 45.2, సిద్దిపేట జిల్లా చేర్యాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మంగళవారం నుంచి మూడు రోజులపాటు 2 డిగ్రీ ల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పు లు వీచే అవకాశమున్నదని, అదేవిధంగా మే 4వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురుస్తాయని వివరించింది.