కవిత రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే
- నిన్నటి వరకు పిట్లల దొర క్యారెక్టర్.. ఇకపై పిట్లల దొరసాని క్యారెక్టర్
- TRS హ్యాంగోవర్ తోనే కవిత బతుకుతున్నారు
- మేం భరతమాతకు బానిసలం.. లిక్కర్ కు కాదు
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) కుమార్తె కల్వకుంట్ల కవిత, తన కొత్త రాజకీయ పార్టీ అయిన 'తెలంగాణ రాష్ట్ర సేన' (Telangana Rashtra Sena)ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సేన(TRS) అధినేత్రి కవితపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(BJP Nizamabad MP Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను తామేప్పుడో మర్చిపోయామని తెలిపారు.
నిన్నటి వరకు పిట్టలదొర క్యారెక్టర్ చూశామన్న అర్వింద్ ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ హ్యాంగోవర్(TRS Hangover) తోనే కవిత బతుకున్నారని, అందుకే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారని పేర్కొన్నారు. బీజేపీ సపోర్టు లేకుండానే తెలంగాణ వచ్చిందా?.. కవిత రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే అన్నారు. ఎంపీ రాష్ట్ర విభజన ప్రక్రియను తప్పుపట్టారు. మేం భరతమాతకు బానిసలం.. లిక్కర్ కు కాదు. కేసీఆర్ కవితకు రోబోలా కనిపిస్తున్నారా? అని కవితను ఆయన ప్రశ్నించారు.






