12 May, 2026 | 11:54 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

తెలంగాణలో అధికారంలోకి 'డబుల్ ఇంజిన్ సర్కార్'

25-04-2026 02:31 PM

గతంలో టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్ కు పుట్టే బిడ్డ పేరు టీఆర్ఎస్

హైదరాబాద్: ప్రజల గురించి ఏ పార్టీ ఆలోచిస్తుందనేది ప్రజలు ఆలోచించాలని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) ప్రజలను కోరారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ అవినీతిరహిత పాలన అందించారని కొనియాడారు. గతంలో టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్ కు పుట్టే బిడ్డ పేరు టీఆర్ఎస్(Telangana Rashtra Sena) అని ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎన్ని పార్టీలు ఉన్నా బీజేపీకి ఇబ్బంది లేదని రామచందర్ రావు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల్లో పార్టీ రోడ్ మ్యాప్ వివరిస్తామని సూచించారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని స్పష్టం చేశారు. కార్యకర్తలు సమన్వయం, సిద్ధాంతపరంగా పనిచేయాలని కోరారు. బీజేపీ కార్యాలయంలో పండిత్ 'దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్'( Deen Dayal Prashikshan Abhiyan ) జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన జిల్లాల శిక్షణ సన్నాహక భేటీ జరిగింది.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర పధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ ఛార్జ్ లు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ శిక్షణ తరగతులు(BJP Training Classes) నిర్వహిస్తోంది. పార్టీ బలోపేతం, సిద్ధాంతాలను రామచందర్ రావు కార్యకర్తలకు వివరించారు. పార్టీలో చేరిన వారికి పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన ఉండాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంపై శిక్షణ తరగతులు  కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ తివారీ జీ, గౌరవ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గౌతమ్ రావు జీ, పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.