18 April, 2026 | 4:00 AM

సీఎంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భేటీ

18-04-2026 01:18 AM

రాజ్ ఘాట్‌ను సందర్శించి మహాత్ముడికి నివాళి

నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఢిల్లీలోని మహాత్మాగాంధీ రాజ్ ఘాట్‌ను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిత్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి లతో కలిసి సందర్శించి ఆయన్ని స్మరించుకుని  నివాళులర్పించారు.