29 July, 2026 | 3:11 PM

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దు

03-09-2025 01:31 AM

-ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

-కేసీఆర్, హరీశ్‌రావులకు తాత్కాలిక ఊరట

-అక్టోబర్ ౭కు విచారణ వాయిదా 

హైదరాబాద్, సెప్టెంబర్ 2(విజయక్రాం తి): కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమి షన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావు పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలం గాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వు లు జారీ చేఇంది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ ౭వ తేదీకి వాయిదా వేసింది. 

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.  పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసెంబ్లీ లో తీర్మానం లేకుండానే ప్రభ్వుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించిందని తెలిపారు. ఘోష్ కమిషన్ నివేదిక రాజకీయ దురుద్దే శంతో కూడుకున్నదని, దీని ఆధారంగా తమపై ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కేసును దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా ఏజీ స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ పిటిష న్‌పై లోతైన విచారణ జరపాల్సి ఉందని అభిప్రాయపడింది.

వెకేషన్ అనంతరం దీనిపై విచారణ చేపడతామని పేర్కొంటూ, తదుపరి విచారణను అక్టోబర్ ౭వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషన ర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధా రంగా ఎటువంటి చర్యలు తీసుకోరా దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో కేసీఆర్, హరీశ్‌రావులకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది.