21 August, 2026 | 1:01 AM

మూడేళ్ల డిప్లొమాలో మార్పుల్లేవు

21-08-2026 12:21 AM
  1. పాలిటెక్నిక్‌ల బలోపేతానికే పునర్వ్యవస్థీకరణ
  2. విద్యార్థులు, ఉద్యోగుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ
  3. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 

హైదరాబాద్, ఆగస్టు 20: మూడేళ్ల డిప్లొమాలో మార్పుల్లేవని, పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడం, మెరుగైన ఉపా ధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభు త్వం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్), గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సచివాలయంలో గురువారం వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు.

పాలిటెక్నిక్ కాలేజీలను కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సీటీఈ) పరిధి నుంచి కమిషనరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (సీఈటీ) ప్రభుత్వం జీఓ 97 జారీ చేసిందని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడానికి, దాని గుర్తింపును మార్చడానికి కాద ని.. కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమేనని స్పష్టం చేశారు. దీని ద్వారా సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల అవసరాలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు.

పాలి టెక్నిక్ కాలేజీల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చ లు జరిపిందని మంత్రి తెలిపారు. జేఏసీ ఛై ర్మన్ నాగరాజు, కన్వీనర్ సురేశ్ తదితరులతో జరిగిన చర్చల్లో వారి అభిప్రాయాలు, సందేహాలు, ఆందోళనలను ప్రభుత్వం వివరంగా తెలుసుకుందని చెప్పారు.

ఈ చర్చల్లో విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన, కార్మిక, ఉపాధి కల్ప న శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రస్తుతం అమల్లో ఉన్న మూడేళ్ల గుర్తింపు పొందిన డిప్లొమా కోర్సు యథావిధిగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు టీజీ ఈసె ట్ ద్వారా ఇంజినీరింగ్‌లో లేటరల్ ఎంట్రీ విధానం యథావిధిగా కొనసాగుతుందన్నారు.