21 August, 2026 | 1:43 AM

అన్నదాతకు యూరియా వెతలు!

21-08-2026 12:55 AM
  1. ప్రభుత్వం నిబంధనలతో యూరియా సరఫరా
  2. అన్నదాతకు అవస్థలు

ఎల్లారెడ్డి ఆగస్టు 20 (విజయ క్రాంతి): యూరియా పట్ల రైతుకు దినదిన గండం గా గడుస్తుంది పంటలు వేసి రెండోసారి యూరియా చల్లడానికి అన్నదాతకు సమయానికి యూరియా అందుబాటులో లేకపోవడం పట్ల రైతు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూరియా సరఫరా పట్ల అన్నదాతలకు అవస్థలు దిన దిన గండం గా ఎదురవుతున్నాయి. 

మొన్నటి వరకు ఒక యాప్

గత కొద్ది రోజుల క్రితం ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులకు యూరియా బుక్ చేసుకోవడానికి సులువుగా ఉండేది ఆ యాప్ ను పలువు రైతులు చూడలేక యాప్ ను వాడడానికి సరిపడు మొబైల్ ఫోన్స్ లేక ఎంతో నలిగిపోతున్నారు. పట్టా పాస్ పుస్తకాలు వారి చేతిలో ఉన్నప్పటికీ రావలసిన యూరియాను రైతులు పొందకపోవడం పట్ల ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలా యూరియాతో ప్రభుత్వం ఏం చేస్తుందిఆంక్షలతో యూరియాను సరఫరా చేయడం పట్ల, రైతులు వ్యవసాయంపై ముగుచుప్పడంలో వెనుకంజ వేయడంలో ససేమిరా తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు.

యూరియా సరఫరా లో అన్నదాతల వద్ద నుండి క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి పంటలు వేసిన రైతులకు మాత్రమే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి యూరియాను నేరుగా వ్యవసాయ అధికారులు అందిస్తే బాగుంటుందని దాన్ని చూడకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు పంట పొలాల్లో రైతులు యూరియాను అవసరమున్నంత మేరకు రైతులకు అందకపోవడంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ మండిపడుతున్నారు. 

ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవసాయ అధికారులు

ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవసాయ అధికారులు పంట పొలాల్లో రైతులు తమ పొలాల్లో వారిపై నాటి సుమారు 25 30 రోజులు గడిచినప్పటికీ రెండవసారి యూరియా చల్లడానికి అవసరం ఉన్నప్పటికీ యూరియా దొరకకపోవడం ప్రాథమిక సహకార సంఘాల్లో పలు ప్రైవేటు దుకాణాలలో యూరియా లేకపోవడం ఉన్నప్పటికీ అధిక ధరలకు ప్రైవేటు వ్యాపారవేత్తలు విక్రయిస్తున్నప్పటికీ పలువురు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం అంత రైతులకు నష్టంగానే జరుగుతుందని రైతులు భావిస్తూ ప్రభుత్వం పట్ల రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

లక్షల టన్నుల్లో యూరియా సరఫరా అంటూ అధికారులు నివేదికలు

లక్షల టన్నుల్లో యూరియా సరఫరా చేస్తున్నామని మాటలకే పరిమితం కానీ రైతులకు అందిందేమీ లేదని అంత బ్రోకర్లు సాగులేని పట్టా పుస్తకాలు ఉన్న రైతులకు యూరియా చేరుతుందని వారి ఇళ్లల్లో మూలన యూరియా మొలుగుతుందని కనీసం అధికారులు సాగున్న సాగు చేస్తున్న రైతుల వద్ద కనీసం సర్వేలు చేయకుండా పాసుపుస్తకాలు ఫర్టిలైజర్ యాప్ లో ఉన్న బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా సరఫరా అందుతుందని పాపం చిన్న రైతుకు యూరియా అంధక ఎంతో నష్టం వాటిల్లుతున్నాడని కనీసం అధికారులు అది గమనించి ప్రతి ఒక్కరికి పంట వేసిన రైతు పొలం వద్దకు చేరి సాంకేతిక క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి యూరియాను అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని పలు రతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరుకు రైతులకు యూరియా కరువు

కొన్ని ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంట పొలాల్లో యూరియా లేక పాపం చెరుకు పంటలు ఇతర పంటలు పెంపకంలో ములుగుతున్నాయని అధికారులకు పట్టనట్టు వ్యవహరించడంలో పలువు రైతులు ఆగ్రహం వ్యక్తం చెందుతున్నారు. 

రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాం

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి లింగంపేట నాగిరెడ్డిపేట గాంధారి తాడువాయి సదాశివ నగర్, రాజంపేట రామారెడ్డి పలు మండలాల్లో ప్రాథమిక సహకార సంఘాల్లో పలు ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాలలో యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె తెలిపారు.

- ఎల్లారెడ్డి డివిజనల్ వ్యవసాయ అధికారి, సుధా మాధురి