కాంగ్రెస్ దేశ వ్యతిరేకి
- వందేమాతరం రెండు చరణాలే పాడుతామనడం జాతివ్యతిరేకం
- ఇది తుష్టీకరణ చర్య, చట్ట ఉల్లంఘనే..
- 1937లోనే హస్తం పార్టీ ‘వందేమాతరం’
- గీతాన్ని విభజించి, దేశాన్ని ముక్కలు చేసింది
- ఓటు బ్యాంకు కోసం మరోసారి బుజ్జగింపు రాజకీయాలు
- సీడబ్ల్యూసీ నిర్ణయంపై కేంద్రహోంమత్రి అమిత్‌షా తీవ్ర విమర్శలు
- ఓట్ల కోసం ప్రతిపక్ష పార్టీ ‘కొత్త ముస్లిం లీగ్’గా మారింది
- భారత మాతను కీర్తించే పవిత్ర గీతాన్ని కాంగ్రెస్ అవమానించింది: బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్
న్యూఢిల్లీ/చెన్నై, ఆగస్టు 20 (విజయక్రాంతి): ‘వందేమా తరం’ గీతాన్ని పూర్తిగా కాకుం డా కేవలం రెండు చరణాలు మాత్రమే పా డాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర విమర్శలు గుప్పించారు. సీడబ్ల్యూసీ తాజా నిర్ణయం ‘దేశ వ్యతిరేకమైనదని, జాతివ్యతిరేకమని, ఇది తుష్టీకరణ చర్య అని, ఇది చట్ట ఉల్లంఘనగా ఆయన అభివర్ణించారు. చట్టాన్ని ధిక్కరిస్తూ తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకే రాహుల్‌గాంధీ సారథ్యంలో మరోసారి బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపిందని ఫైర్ అయ్యారు.
జాతీయ గీతం వందే మాతరాన్ని కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బుధవారం తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ, అమిత్‌షా దేశ విభజన చరిత్రను ప్రస్తావించారు. అలాగే, గతంలో వందేమాతరం గీతాన్ని కుదించ డం వల్ల దేశం ఎదుర్కొన్న పరిణామాలను ఆయన స్పష్టంగా చెప్పారు.
1937లోనే హస్తం పార్టీ ‘వందేమాతరం’ గీతాన్ని విభ జించి, దేశాన్ని ముక్కలు చేసిందని విమర్శిం చారు. ఓట్ల కోసం ప్రతిపక్ష పార్టీ ‘కొత్త ము స్లిం లీగ్’గా మారిపోయిందని బీజేపీ అధ్యక్షు డు నితిన్ నబీన్ కూడా కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. భారత మాత’ను కీర్తించే ఈ పవిత్ర గీతాన్ని కాంగ్రెస్ అవమా నిం చిందని స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు కోసం దేశ ఆత్మగౌరవాన్ని పదేపదే తాకట్టు పెట్టిన కాంగ్రెస్ చరిత్రకు నిదర్శనంగా నిలు స్తోందని ఆయన విమర్శించారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ ‘కొత్త ముస్లిం లీగ్’
వందేమాతరంలో కేవలం రెండు చర ణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ నిర్ణ యంపై బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూ డా తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం ఆ ప్రతిపక్ష పార్టీ ‘కొత్త ముస్లిం లీగ్‘గా మారిందని ఆయన ఆరోపించారు. ‘భారతమాత’ ను కీర్తించే వందేమాతరం పవిత్ర గీతాన్ని అవమానించడం అంటే, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించేటప్పుడు ఈ గీతాన్ని తమ హృదయాల్లో నిలుపుకున్న వేలాది మంది అమరవీరులను అగౌరవపరచడ మేనని స్పష్టం చేశారు. వందేమాతరంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) బుధవారం నిర్ణయం నేపథ్యంలో నితిన్‌నబీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు వందేమాతరం పట్ల తన అవమానకర వైఖరిని ఒక అధికారిక తీర్మానంగా మార్చుకుందని విమర్శించారు.
‘కాంగ్రెస్ నేడు కొత్త ముస్లిం లీగ్‌గా మారిందని ఆయన ఆరోపించారు. ఆగస్టు 15న కాం గ్రెస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం పూర్తి గీతాన్ని పాడకపోవడంపై చెలరేగిన వివా దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, జాతీయ గీతం పట్ల అదే రకమైన అవమానం కొద్ది రోజుల క్రితం ఒక ‘వ్యక్తి ప్రవర్తన’లో కని పించిందని నబిన్ గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్ దానిని కేవలం ఒక ‘యాదృచ్ఛిక సంఘటన’గా కొట్టిపారేసిందని, నేడు అదే అవమానం కాంగ్రెస్ పార్టీ విధానంగా మా రింది అని తెలిపారు. ఇది కేవలం రాజకీ య సమర్థన మాత్ర మే కాదు, ఓటు బ్యాంకు కోసం దేశ ఆత్మ గౌరవాన్ని పదేపదే తాకట్టు పెట్టిన కాంగ్రెస్ చరిత్రకు నిదర్శనం అని నితిన్ నబీన్ స్పష్టం చేశారు.






