18 August, 2026 | 11:02 AM

సీపీఎస్ వద్దు.. ఓపీఎస్సే ముద్దు

02-09-2025 12:14 AM

-పెన్షన్ ప్రభుత్వాలు బిక్ష కాదు.. ఉద్యోగి హక్కు  

-సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్  అమలు చేయాలి 

-కలెక్టరేట్ ఎదుట బిజీఈజెఎసి ఆధ్వర్యంలో నిరసన 

కుమ్రం భీం ఆసిఫాబాద్/ఆదిలాబాద్/నిర్మల్/మంచిర్యాల, సెప్టెంబర్ 1 (విజయ క్రాం తి): సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీజీ ఈ జేఏసీ చైర్మన్ రాజశేఖర్ డిమాండ్ చేశారు.సోమవారం పెన్షన్ విద్రోహక దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సిపిఎస్ అనేది ఉద్యోగికి చాలా ఇబ్బం దికరమైన అంశమని పేర్కొన్నారు.

ఉద్యోగి రిటైర్డ్ కాకుండా ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఇది గ్రహించిన పలు రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్నిరద్దు చేశారని పేర్కొన్నారు.రద్దు చేసిన రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోసం జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడుతుందని తెలిపారు.పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని ఈ ప్రభుత్వాలు పెట్టే బిక్ష కాదని తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి అహ్మద్ ఉమర్ హుస్సేన్ కో చైర్మన్ లు శాంతి కుమారి,అబ్దుల్ కమర్ ,పోషన్న, తుకారాం, శశిధర్, తోటజీ ,నవీన్ రెడ్డి, జయదేవ్, అబ్రహం, మీనా హజ్, అలీ ,కరుణాకర్ ,అఖిల్, కృష్ణ ,వైస్ చైర్మన్ లు ఉషన్న, మాణిక్ రావు ,సదాశివ్, సుభాష్, రియాజ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

ఓపీఎస్ పునరుద్దరించాలి

ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నాయకులు సంద అశోక్ డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం విద్రోహ దినంగా పాటిస్తు ఆందోళన నిర్వహించారు. స్థానిక టీఎన్జీవోస్ భవనం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన కూడళ్ల గుండా ర్యాలీ చేపట్టారు. అనంతరంకలెక్టరేట్ కు చేరుకుని కార్యాలయం ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించి సీపీఎస్ ను రద్దు చేసి, ఓపీఎస్ ను పునరుద్దరించాలని నినాదాలతో హోరెత్తించారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్, అరుణ్, శివకుమార్, రవీందర్, శ్రీనివాస్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి 

ప్రభుత్వ ఉద్యోగులకు ఓపిఎస్ విధానాన్ని అమలు చేసి సిపిఎస్ ను రద్దు చేసే వరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ పోరాటం ఆగదని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ రవికుమార్ ఉద్యోగ సంఘాల నాయకులు పీజీ రెడ్డి రవికాంత్ జనార్ధన్ రవికుమార్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు

సీపీఎస్ రద్దు చేయాలని ఆందోళన

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమ వారం జిల్లా కలెక్టరేట్ ముందు టీజీఈ జేఏసి నాయకులు ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, సభ్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి, జనరల్ సెక్రెటరీ వనజా రెడ్డి, పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు ధరణికోట వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి సూరినేని గంగాధర్, ఎస్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోకల వెంకటేశ్వర్లు, శంకర్ గౌడ్, టి ఆర్ ఈ ఎస్ ఏ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ దేశ్పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడ్య కృష్ణ, పిఆర్టియు టీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు బండ శాంకరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాస రవి, డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష  ప్రధాన కార్యదర్శి ఆసంపల్లి రమేష్, మోతే జయకృష్ణ ,టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య , జిల్లా కార్యదర్శి సునీత, ఎంపీఈవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి బాపూరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చక్రపాణి గుర్రాల రాజ వేణు, టీఎస్ జెఎఫ్డిఏ కాలేశ్వరం థర్డ్ జోన్ అధ్యక్షులు అబ్దుల్ ఆజాజ్ తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు కే రాజ్యలక్ష్మి. పాల్గొన్నారు.