calender_icon.png 2 September, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామనరావు దంపతుల హత్యపై సీబీఐ దర్యాప్తు

02-09-2025 12:14:48 AM

  1. ఆగస్టు 25న ఎఫ్‌ఐఆర్ నమోదు 
  2. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం
  3. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పుట్ట మధు పేరు

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): న్యాయవాదులు వామనరావు దంపతుల హత్యపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశంతో ఆగస్టు 25న ఎఫ్‌ఐఆర్ సీబీఐ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో వెల్డి వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లు చేర్చింది.

అయితే వామనరావు దంపతుల హత్యపై సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదని, పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నది. కాగా ఆ అఫిడవిట్‌లో పుట్ట మధు పేరును ప్రభుత్వం చేర్చగా.. ఐపీసీ సెక్షన్లు 120బీ, 341, 302, 34 కింద సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.