19 May, 2026 | 6:18 AM

ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదు

19-05-2026 12:00 AM

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

మిర్యాలగూడ మే 18 : వీర్లపాలెంలోని యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరిగినప్పటికీ ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లో ఆదివారం మధ్యాహ్నం ప్లాంట్లోని యూనిట్-3లో ట్బన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీక్ కావడం వల్ల  మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం జరగడంతో సోమవారం శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి  అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన యూనిట్ సందర్శించి, ప్రమాదం జరిగిన పరిస్థితిని  సమీక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్, వాల్వ్లు దెబ్బతిన్నప్పటికీ, ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం జరగలేదు అని అన్నారు.కంట్రోల్ రూమ్ కి వెళ్లి ప్రమాదం జరిగిన సీసీ టీవీ విజువల్స్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో  అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.