అభివృద్ధి పనులను ప్రారంభించిన వరంగల్ సీపీ
హనుమకొండ, మే 18(విజయ క్రాంతి):వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో పోలీస్ కార్ల మరమ్మత్తుల కోసం నూతనంగా నెలకొల్పబడిన భారీ హైడ్రాలిక్ యంత్రంతో పాటు, వాహన టైర్లను తొలగించి, అమర్చే యంత్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ అధికారులతో కలసి ఈ యంత్రాల పనితీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యం.టి విభాగంలో వాహనాల మరమ్మత్తుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాల ద్వారా పోలీస్ వాహనాల మరమ్మత్తు కోసం ప్రవైట్ రిపేర్ సెంటర్లపై ఆధారపడకుండా స్వయంగా మరమ్మత్తులు చేపట్టడం ద్వారా సమయంతో పాటు , కొద్ది మొత్తంలో వ్యయాన్ని అదా చేసుకోవచ్చని, పోలీస్ వాహనాలను వినియోగించె అధికారులు, సిబ్బంది వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వాహనాలను మరమ్మత్తుల కోసం పంపించాల్సిన అవసరం ఉండదని సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, దార కవిత, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్,ఏసీపీలు నాగయ్య, అంతయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి,సత్యనారాయణ, జాన్ నర్సింహులు ఆర్.ఐలు శ్రీధర్, స్పర్జన్ రాజ్, సతీష్, చంద్రశేఖర్, శ్రీనివాస్ తో ఇతర అధికారులు యం. టి విభాగం సిబ్బంది పాల్గొన్నారు.






