24 April, 2026 | 1:32 AM

నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదు

24-04-2026 12:00 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 23(విజయక్రాంతి):కరీంనగర్ నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరా లో భాగంగా గురువారం రోజు కోర్టు రిజర్వాయర్ లో హైలెవల్ నీటి సరఫరా డివిజన్ల కార్పోరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆద్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. హైలెవల్ నీటి సరఫరా లో తరుచుగా తలెత్తున్న త్రాగు నీటి సమస్యలు, ప్రజల ఇబ్బందులు, వాటి పరిష్కారం, నీటి సరఫరా సమయపాలన, లీకేజీల నివారణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలువురు కార్పోరేటర్లు నీటి సరఫరా లో ప్రజల ఇబ్బందులు, సమస్యలను మేయర్, కమీషనర్ దృష్టికి తీసుకురాగా ఇరువురు సానుకూలంగా స్పందించారు.

ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరా పై ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాలకవర్గ సభ్యులు సమావేశంలో దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను యుద్దప్రాతిపదికన పరిష్కరిస్తూ ప్రజలకు జవాబు దారితనంతో పని చేయాలన్నారు. నీటి సరఫరా సమయంలో ఈఈ, డీఈ, ఏఈ, లైన్ మెన్, పిట్టర్ అందరు ఫీల్ లో ఉండి పర్యవేక్షించాలన్నారు. ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదు వచ్చిన పరిశీలించి చర్యలు తీసుకోవలని అదికారులు, సిబ్బంది మద్య సమన్వయ లోపం రాకుండా జాగ్రత్తలు తీస్కోవాలన్నారు. కార్పోరేటర్లు, ప్రజలు అధికారులు, సిబ్బంది దృష్టికి తెచ్చిన సమస్యను నోట్ చేస్కోని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

మంచి నీటి సరఫరా విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. లైన్ మెట్లు, పిట్టర్లు ముఖ్యంగా జవాబుదారీతనంగా పని చేయాలన్నారు.డీఈ లు, ఈఈగలు, ఏఈలు, గ్రౌండ్ లెవల్ లో ఎలాంటి సమస్యలు తలెత్తినా ముందస్తు జాగ్రత్తతో పరిష్కరించేలా చూడాలన్నారు. కొత్తగా నీటి సరఫరా పైపులైన్ పనులకు ప్రపోజల్స్ తెలపాలని,కోర్టు నుండి సుభాష్ నగర్ వరకు నూతన పైపులైన్ పనులకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.

నీటి సరఫరా లో 60 మంది ని కొత్తగా తాత్కాలిక లేబర్లను తీసుకోవడం జరిగిందని ,వారితో నగర వ్యాప్తంగా ఎక్కడ లీకేజీలు ఉన్నా గుర్తించి వెంట వెంటనే అరికట్టాలని అన్నారు. ఈ సమావేశంలో కార్పోరేటర్లు, ప్రవీణ్ రావు, అంజన్ కుమార్, గంట శ్రీనివాస్, బండ రమణారెడ్డి, ఓంటెల సత్యనారాయణ రెడ్డి, వరాల నర్సింగం, గుగ్గిళ్ల జయశ్రీ, రమన్ ,చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిల్ల రాజకుమారి- ప్రసాద్, గాజ రమ-శివరాం, ఎన్నం లక్ష్మీ-ప్రకాష్, పెద్దపల్లి శ్రీలేఖ-జితేంధర్, ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈ ల, ఏఏఈలు, లైన్ మెన్లు మరియు పిట్టర్లు పాల్గొన్నారు.