కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోడీ సవాల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ సవాల్ విసిరారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో.. ఆయా రాష్ట్రాల్లోని సీఎంలకు సవాలు చేస్తున్నానన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇది తన రాజకీయ ప్రకటన కాదు, తన ఎన్నికల ప్రకటన కాదని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రరిశ్రమలు, వ్యాపారులను, పెట్టుబడిదారులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు చెప్పాలని ప్రశ్నించారు.
ఇలా చేస్తే.. ఏ వ్యాపారవేత్త వచ్చి కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారని ప్రధాని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల యువకుల భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించాలన్నారు. తన వద్దకు వచ్చిన పెట్టుబడిదారులందరూ మేము కాంగ్రెస్ పాలిత పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లబోమని చెబుతున్నారన్న విషయాన్ని ఆయన ప్రజలముందు పెట్టారు.






