6 August, 2026 | 1:00 AM

ఆప్ కార్యాలయం ముందు ఉద్రిక్తత.. అక్కడే బైఠాయించిన కేజ్రీవాల్‌

19-05-2024 01:25 PM

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ముందు ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ  కేంద్ర కార్యాలయానికి వెళ్తేందుకు ఆప్ నేతలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లకుండా ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్ కార్యాలయం ముందు బైఠాయించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరసన తెలిపారు. డీడీయూ మార్గ్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆప్‌ నేతలందరినీ జైల్లో పెట్టండి.. బీజేపీ ఆఫీసుకు ర్యాలీగా వెళ్తామని కేజ్రీవాల్ తెలిపారు. అడ్డుకుంటే అక్కడే బైఠాయిస్తాం.. అరగంట వేచిచూస్తామని వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని అరెస్ట్ చేయకుంటే బీజేపీ ఓడిపోయినట్టేనని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు