5 August, 2026 | 10:33 PM

రాహుల్ వల్లే పెట్టుబడులు రావట్లేదు: ప్రధాని

19-05-2024 02:39 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వాడే భాష మావోయిస్టుల భాషలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. రాహుల్ భాష వల్లే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు రావట్లేదని ఆయన ఆరోపించారు. పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు 50 సార్లు ఆలోచిస్తున్నారి చెప్పారు. కాంగ్రెస్ కు, జేఎంఎంకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదని విమర్శించారు. ప్రజల సంపదను ఎక్స్ రే తీసి దోచుకోవడమే కాంగ్రెస్, జేెఎంఎం లక్ష్యమని ద్వజమెత్తారు. ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను లాక్కోవాలని  ఇండియా కూటమి భావిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలకు పాల్పడుతుందన్న ప్రధాని లోక్ సభ స్థానాలను తన పూర్వీకుల ఆస్తులుగా భావిస్తోందని వ్యాఖ్యానించారు.