24-04-2025 01:46:36 AM
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్ పార్టీ ఈనెల 27న రజతోత్సవ వేడుకలకు సిద్ధ్దమైంది. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తుండటంతో వరంగల్ దగ్గరలో ని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సభా నిర్వహణను బీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
దీని కోసం గులాబీ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకుంటోంది. ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మ డి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలతో ప్రతిరోజు ఓ జిల్లా చొప్పున ఆయన రివ్యూ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు రాకపోవడంతో కారు పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. దీనితో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ జనసమీకరణతో నిర్వహించి సత్తా చాటాలని కారు పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్ అంతగా ప్రజల్లోకి రావడం లేదు. నేతలను వ్యవసాయ క్షేత్రానికే పిలుపించుకొని సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుత వరంగల్ సభ బాధ్యతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీసుకున్నారు. మొదటి నుంచి ఆయనే గ్రేటర్ హైద రాబాద్‌లో పార్టీ బాధ్యతలు పర్యవేక్షించారు. రెండుసార్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయ నే ఎన్నికల నిర్వహణను చూసుకున్నారు.
అసెం బ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో టిక్కెట్ల పంపిణీ మొదలుకొని ప్రచార బాధ్యతలు, పోల్ మేనేజ్‌మెంట్ వ్యవహారాన్ని సమర్థవంతగా నిర్వహిం చారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పాత్రను పోషిస్తున్నారు.
ఎల్కతుర్తి సభ కోసం రూపొందించిన పోస్టర్లు, పాటల సీడీలను ఆవిష్కరించడం, నేతలతో సభా ఏర్పాట్లపై నిత్యం సమావేశాలు నిర్వహిం చడంలో బిజీబిజీగా మారారు. సభను అత్యంత ఆధునిక పద్ధతిలో నిర్వహించేందుకు సాంకేతిక నిపుణులతో ఇప్పటికే ఆయన పలు దఫాలుగా సమావేశమ య్యారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా, సౌకర్యాల కల్పనపై రివ్యూలు చేస్తున్నారు.
కేటీఆర్ ప్రధానంగా గ్రేటర్ ఎమ్మెల్యేలను సమన్వయంపై దృష్టి సారించారు. గ్రేటర్‌లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి గ్రేటర్ నుంచి 50వేల మంది దాకా జనసమీకరణ చేయాలని ఆయన నేతలకు దిశా నిర్దేశం చేశారు. గ్రేటర్‌తో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ ఆయన విస్తృతంగా పర్యటిస్తూ నేతలను కోఆర్డినేట్ చేస్తున్నారు. సభా ఏర్పాట్లును నిత్యం సమీక్షిస్తూ నేతలకు సూచనలు ఇస్తున్నారు.
ఎల్కతుర్తిలో సభ జరిగే ప్రాంతల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేటీఆర్ పాత్ర పార్టీలో అత్యంత కీలకంగా మారిందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినపడుతోంది. సభ ముగిసిన తర్వాత ఈనెల చివరి నుంచి సభ్యత్వ నమోదు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. సభ్యత్వ నమో దు ప్రక్రియను మొత్తం కేటీఆర్ పర్యవేక్షించనున్నారు. పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతుల కార్యక్రమం కూడా ఆరంభం కాబోతున్నది. ఈ రకంగా పార్టీని కేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే కీలకమైన టాస్క్ కేటీఆర్ ముందున్నది.