calender_icon.png 11 February, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక ప్రత్యేక అధికారి పాలన

11-02-2026 03:38:31 AM

  1. నేటి నుంచి బల్దియా బాధ్యతలు వారికే

ముగిసిన పాలకమండలి గడువు 

మాజీలైన మేయర్, కార్పొరేటర్లు

స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్?

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఐదేళ్ల పాలకమండలి ప్రస్థానం మంగళవారం సాయం త్రంతో ముగిసింది. 2021లో కొలువుదీరిన ప్రస్తుత పాలకమండలి గడువు తీరడంతో, బుధవారం తెల్లవారుజాము నుంచే నగరం ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ సహా 300 మంది కార్పొరేటర్లు మాజీలయ్యారు. కీలకమైన ఆదేశాలను సర్కారు బుధవారం జారీ చేసే అవకాశాలున్నాయి.

నగర పరిపాలనా పగ్గాలు పూర్తిగా ఐఏఎస్ అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం పాలకమండలి లేని సమయంలో కౌన్సిల్, స్టాండింగ్ కమిటీలకు ఉండే సర్వాధికారాలు ప్రత్యేక అధికారికి బదిలీ అవుతా యి. అంటే, గతంలో మేయర్ లేదా స్టాం డింగ్ కమిటీ చర్చించి తీసుకునే కీలక నిర్ణయాలు, కోట్ల రూపాయల నిధుల మంజూ రు, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం వంటివన్నీ ఇకపై స్పెషలాఫీసర్ ఒక్కరి సంతకంతోనే ఖరారు అవుతాయి.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జయేష్ రంజన్ను స్పెషలాఫీసర్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సచివాలయ వర్గాల్లో బలం గా వినిపిస్తోంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడో అంతస్తులో లేదా మొదటి అంతస్తులోని మేయర్ ఛాం బర్లో ప్రత్యేక కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. స్పెషలాఫీసర్ పాలనలో రాజకీయ జోక్యం ఉండదు కాబట్టి నిర్ణయాలు వేగంగా జరుగుతాయని అధికారు లు భావిస్తున్నారు.

పారిశుధ్యం, వీధి దీపా లు, డ్రైనేజీ నిర్వహణ వంటి పౌర సేవలతో పాటు, గత పాలకమండలి ఆమోదించిన పెండింగ్ పనుల అమలుపై స్పెషలాఫీసర్ దష్టి సారించనున్నారు. ముఖ్యంగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నేతత్వంలోని యంత్రాం గం పన్నుల వసూళ్లు, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడటం వంటి అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తోం ది.

ప్రజలు తమ సమస్యల కోసం కార్పొరేటర్ల ఇళ్ల చుట్టూ తిరిగే పని లేకుండా, నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసే వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. కాగా జీహెచ్‌ఎంసీ పరిధి గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ఇటీవలే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో, కార్పొరేషన్ విస్తీర్ణం 2,053 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఇంతటి భారీ విస్తీర్ణాన్ని ఒక్కరే పర్యవేక్షించడం కష్టమని భావిస్తున్న ప్రభుత్వం.. గ్రేటర్ హైదరా బాద్ను మూడు ముక్కలుగా విభజించేందుకు కసరత్తు చేస్తోంది.

హైదరా బాద్ మున్సిపల్ కార్పొరేషన్.. శంషాబాద్ వరకు ఉన్న సుమారు 150 వార్డులతో ఇది కొనసాగనుంది. గ్రేటర్ సైబరాబాద్ కార్పొరే షన్.. ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాం తాలతో కొత్త కార్పొరేషన్. గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్.. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పరిధిలోని విలీన ప్రాంతాలతో మరో కార్పొరేషన్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలు వడే ఫిబ్రవరి 13వ తేదీ తర్వాత దీనిపై క్లారిటీ రానుంది. ఇప్పటికే సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లతో కొత్త బోర్డులు సిద్ధమవడమే కాకుండా, కార్యాలయాల ఏర్పాటు కు అన్వేషణ కూడా మొదలైంది.